న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో మరో 573 మంది మృతి చెందగా, 3,06,357మంది కోలుకున్నారని తెలిపింది. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో 50లక్షల మందికి పైగా బాధితులు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 22,23,018 కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 19.5 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో 163.84 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.
India Reports over 2.86 lakh fresh corona cases