టెర్రరిస్ట్ లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు మరో ఝలక్ ఇచ్చేందుకు భారత్ నిర్ణయించింది. భారతదేశంలో ఉత్పత్తి అయిన ఎలక్ట్రానిక్స్ , ఈ కామర్స్ ఉత్పత్తులు పాకిస్తాన్ కు ఎగుమతి కాకుండా అరికట్టేందుకు గట్టి చర్యలు చేపట్టింది. నిజానికి మనదేశం నుంచి ఈ ఉత్పత్తులు ప్రత్యక్ష వాణిజ్యం ద్వారా నేరుగా పాకిస్తాన్ కు ఎగుమతి కావు. అయితే పరోక్షంగా అంటే, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ వంచి మధ్యవర్తిత్వ దేశాల ద్వారా దాదాపు 10 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్ ఉత్పత్తులు పాకిస్తాన్ కు చేరుతాయి. అవే కాదు, రత్నాలు, ఆభారణాలు, బంగారు నగలు, కూడా పాకిస్తాన్ కు మూడో దేశాల ద్వారా అందుతాయి. పరోక్షంగా ఇలాంటి వాణిజ్యం వల్ల ఆ ఉత్పత్తుల ధరలు పెరిగినా, భారతీయ ఉత్పత్తులకు పాకిస్తాన్ లో చాలా డిమాండ్ ఉంది.
దొడ్డి దారిలో ట్రాన్స్ షిప్ మెంట్ భారతదేశంలో తయారైన ఉత్పత్తులు మూడో దేశం చేరినప్పుడు అక్కడి కొన్ని కంపెనీలు వాటిని కస్టమ్స్ సుంకాలు వసూలు చేయని గిడ్డంగులలో నిల్వచేస్తాయి. ఆ తర్వాత భారతీయ ఉత్పత్తులపై ఉన్న లేబుల్స్, ధరలపట్టి, ఇతర లేబుల్స్ మార్చి, తిరిగి ప్యాకింగ్ చేసి, కొత్తగా మరో లేబుల్ వేసి, పాకిస్తాన్ కు షిప్ల ద్వారా రవాణా చేస్తాయు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారతదేశం కొన్ని కఠిన మైన నిర్ణయాలు తీసుకున్నందువల్ల పాకిస్తాన్ ఎయిర్ కార్గో కారిడార్ ను ముసివేసే అవకాశం ఉంది. దీంతో ఆ చర్యవల్ల ఎదురయ్యే పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు భారతదేశం సంసిద్ధమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపారు.