దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాచ్‌లో టాస్ ఓడి ఫీల్డింగ్ దిగిన భారత జట్టు ఆసీస్‌ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా.. భారత్‌కు 265 పరుగుల టార్గెట్‌ను ముందుంచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కొన్నోలీ(0) వికెట్‌ను కోల్పోయింది. కానీ, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కాసేవు పరుగుల వరదపారించాడు. కానీ, వరుణ్ చక్రవర్తి తన మొదటి ఓవర్‌లోనే హెడ్(39)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు అండగా నిలిచాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం సాధించి షమీ బౌలింగ్‌లో స్మిత్(73) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్‌తో పాటు బ్యాటింగ్‌కి వచ్చిన లబుషేన్(29), ఇంగ్లిస్(11) మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.
ఈ దశలో క్యారీ భారత బౌలర్లను ఎదురుకుంటూ పరుగు సాధించాడు. కానీ, అతనికి ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి సరైన సహకారం లభించలేదు. మ్యాక్స్‌మెల్(7), డ్వార్షుస్(19) పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యారు. అయితే అర్థ శతకం చేసిన క్యారీ శ్రేయస్ అయ్యర్ చేతిలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఎల్లిస్(10), జంపా(7) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో షమీ 3, వరుణ్, జడేజా చెరి 2, హార్థిక్, అక్షర్ తలో వికెట్ తీశారు.