Wednesday, January 22, 2025

ఆ నక్షత్రాల జాడ కనుగొనడంలో భారత్ సారస్ టెలిస్కోప్ సాయం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : బిగ్‌బ్యాంగ్ తరువాత 200 మిలియన్ సంవత్సరాలకు విశ్వంలో ఆవిర్భవించిన మొట్టమొదటి నక్షత్రాలు, పాలపుంతల జాడను కనుగొనడంలో భారత్ సారస్ (ఎస్‌ఎఆర్‌ఎఎస్)టెలిస్కోప్ ఎంతో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు మొట్టమొదటి రేడియో తరంగాలతో కూడిన అత్యంత ప్రకాశవంతమైన నక్షత్ర సముదాయాల లక్షణాలను కనుగొన గలిగారు. ఈ విధంగా మొట్టమొదట నక్షత్రాలు ఏర్పడిన కాలాన్ని “విశ్వమహోదయం”గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల సమాజం ఈ వివరాలను నేచర్ ఆస్ట్రానమీ లో ప్రచురించింది.

ఈ విధంగా ఏర్పడిన రేడియో శబ్దతరంగాలతో కూడిన పాలపుంతలు సాధారణంగా బ్రహ్మాండమైన కృష్ణబిలాలచే శక్తిని పొందుతుంటాయి. బెంగళూరు కేంద్రంగా ఉన్న రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ) కు చెందిన సౌరభ్ సింగ్‌తో కూడిన శాస్త్రవేత్తల బృందం అత్యంత ప్రకాశవంతమైన పొడవైన రేడియో తరంగాలతో కూడిన మొదటి తరం పాలపుంతల శక్తి ఉత్పత్తి, ప్రకాశవంతం, ద్రవ్యరాశిని అంచనా వేయగలిగింది. షేప్డ్ ఆంటెన్నా మెజర్‌మెంట్ ఆఫ్ ది బ్యాక్‌గ్రౌండ్ రేడియో స్పెక్ట్రమ్ 3 (ఎస్‌ఎఆర్‌ఎఎస్) టెలిస్కోప్ బెంగళూరు ఆర్‌ఆర్‌ఐ లోనే స్వదేశీయంగా తయారైంది.

ఉత్తరకర్ణాటక లోని దండిగణహళ్లి సరస్సు, షారవతి జలాల్లో 2020లో ఈ టెలిస్కోప్‌తో ప్రయోగాలు చేశారు. ఈ టెలిస్కోప్ సహాయం తోనే ప్రథమ నక్షత్రాలను, పాలపుంతలను కనుగొన గలిగారు. ఆర్‌ఆర్‌ఐ తోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఒ) , యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్శిటీ ఆఫ్ టెల్ అవీవ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ టెలిస్కోప్‌తో సగటున 21 సెంటీమీటర్ లైన్‌లో ఇవన్నీ కనుగొనడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News