Sunday, January 19, 2025

ఉప్పల్ స్టేడియంపై చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు (ఐసిసి) పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తో పంచుకుంది. భారత గడ్డపై అక్టోబర్‌నవంబర్ నెలల్లో ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. ఇదిలావుంటే వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్య ఇస్తున్న స్టేడియాలను బిసిసిఐ ప్రకటించింది. దేశంలోని తొమ్మిది నగరాల్లో భారత్ తన మ్యాచ్‌లను ఆడనుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఈసారి నిరాశే మిగిలింది. భారత్ ఆడే మ్యాచ్‌లలో ఒక్కటి కూడా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి దక్కలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటిగా పేరున్న ఉప్పల్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లు ఉంటాయని అభిమానులు భావించారు.

అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంపై తన సవతి ప్రేమను మరోసారి చాటుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు ఈ వరల్డ్‌కప్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలోని ప్రముఖ స్టేడియాల్లో ఒకటిగా పేరున్న ఉప్పల్‌లో మాత్రం భారత్ ఆడే మ్యాచ్‌లను కేటాయించేందుకు బిసిసిఐ ఆసక్తి చూపించలేదు. ఈసారి వరల్డ్‌కప్‌లో భారత్ తొమ్మిది వేదికల్లో లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె, ధర్మశాల, లక్నో, ముంబై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ధర్మశాల వంటి చిన్న స్డేడియానికి భారత్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కినా ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉన్న హైదరాబాద్‌కు ఛాన్స్ దొరకక పోవడం గమనార్హం. ఇదిలావుంటే కిందటిసారి ఉప్పల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా టికెట్ల విక్రయాలకు సంబంధించిన పెద్ద ఎత్తున

అక్రమాలు జరిగాయని వార్తలు రావడం కూడా ఈసారి హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేయక పోవడానికి ఒక కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగినా టికెట్ల అమ్మకాలకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు నెలకొనడం అనవాయితీగా వస్తోంది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే భారత్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉప్పల్ స్టేడియానికి ఇవ్వలేదని హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేగాక హెచ్‌సిఎలో నెలకొన్న అంతర్గత వివాదాలు కూడా దీనికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News