Tuesday, December 17, 2024

విజయానికి 26 పరుగుల దూరంలో భారత్

- Advertisement -
- Advertisement -

ఢాకా: షీరీ బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. రెండు టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 43 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 26 పరుగులు చేస్తే భారత జట్టు గెలుస్తుంది. మూడు వికెట్లు తీస్తే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుంది. నాల్గో రోజు అక్షర పటేల్ 34 పరుగులు చేసి మెహిడీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. జయదేవ్ ఉనద్కత్ 13 పరుగులు చేసి షాకీబ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లలో శ్రేయస్ అయ్యర్ (26), రవీచంద్రన్ అశ్విన్ (19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 227
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 231
భారత్ తొలి ఇన్నింగ్స్: 314

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News