- Advertisement -
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 39 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 276 పరుగులు చేస్తే ఇండియా గెలిచే అవకాశం ఉంది. భారత్ చేతిలో నాలుగు వికెట్లు ఉండడంతో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారత్ బ్యాట్స్‌మెన్లలో శుభ్‌మన్ గిల్(50), ఛటేశ్వరా పుజారా(15), రిషబ్ పంత్(11), రోహిత్ శర్మ(12) పరుగులు చేసి ఔటయ్యారు. వాషింగ్టన్ సుందర్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (45), రవిచంద్రన్ అశ్విన్ (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా జాక్ లీచ్ రెండు వికెట్లు, డొమినిక్ బెస్ ఒక వికెట్ తీశాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578
ఇండియా తొలి ఇన్నింగ్స్: 337
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178
- Advertisement -