బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసి ఆలౌటైంది. వాషింగ్ టన్ సుందర్, శార్థూల్ టాగూర్ హాఫ్ సెంచరీలో అదరగొట్టేశారు. ఇప్పటి వరకు ఆసీస్ 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో వికెట్‌పై వాషింగ్‌టన్ సుందర్, శార్థూల్ టాగూర్ 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాట్స్ మెన్లలో శార్థూల్ టాగూర్(67), వాషింగ్ టన్ సుందర్(62), రోహిత్ శర్మ (44), మయాంక్ అగర్వాల్(38), రహానే(37), ఛటేశ్వర్ పూజారా (25), రిషబ్ పంత్(23), సిరాజ్(13), గిల్(07), సైనీ(05) పరుగులు చేసి ఔటయ్యారు. నటరాజన్ ఒక్క పరుగు చేసి నాటౌట్ గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్ ఐదు వికెట్లు, కమ్నీస్, స్టార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా నాథన్ లయన్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది.