- Advertisement -
చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 51 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుత భారత జట్టు 358 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (14), అజింక్య రహానే (10), ఛటేశ్వరా పుజారా(07), రిషబ్ పంత్ (08), అక్షర పటేల్ (07) పరుగులు చేశారు. ఏడో వికెట్‌పై విరాట్ కోహ్లీ, రవీచంద్రన్ అశ్విన్ 50 పరుగుల పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(44), రవీచంద్రన్ అశ్విన్(35) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా మోయిన్ అలీ రెండు వికెట్లు తీశాడు.
- Advertisement -