Monday, January 20, 2025

స్మృతి మంధనా సెంచరీ… 243/3

- Advertisement -
- Advertisement -

India Scored 243 runs for 3 Wickets

హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 243 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్మృతి మంధనా సెంచరీతో చెలరేగింది. హర్మన్ ఫ్రీత్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టింది. మూడో వికెట్ పై హర్మన్ ఫ్రీత్, మంధనా 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యాస్టికా భాటియా 31 పరుగులు చేసి సల్మెన్ బౌలింగ్‌లో మైదానం వీడింది. మిథాలీ రాజ్ ఐదు పరుగులు చేసి మ్యాథ్యూస్ బౌలింగ్ షమిలాకు క్యాచ్ ఇచ్చి ఔటయింది. దీప్తి శర్మ 15 పరుగులు చేసి మహ్మాద్ బౌలింగ్‌లో మ్యాథ్యూస్‌కు ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో స్మృతి మంధానా(104), హర్మన్‌ప్రీత్ కౌర్(70) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News