Saturday, December 21, 2024

టీమిండియా 376 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 91.2 ఓవర్లలో 376 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ సెంచరీతో కదంతొక్కగా రవీంద్ర జడేజా గౌరవ ప్రదమైన పరుగులు చేశాడు. ఏడో వికెట్‌పై ఇద్దరు కలిసి 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్లలో అశ్విన్ (113), రవీంద్ర జడేజా(86), యశస్వి జైస్వాల్(56), రిషబ్ పంత్(39), కెఎల్ రాహుల్(16), అకాశ్ దీప్(17), బుమ్రా(07), రోహిత్ శర్మ(06), శుభ్‌మన్ గిల్(0), సిరాజ్ నాటౌట్ పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్ముద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు, నహిద్ రానా, మెహిడీ హసన్ మిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News