Wednesday, November 6, 2024

సత్ఫలితాలిస్తున్న కరోనా కట్టడి చర్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేస్తుండడంతో దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత రోజువారీ కేసులు 2 లక్షలకు దిగువన నమోదు కావడం ఊరటనిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. గత నాలుగు రోజులుగా 4 వేలకు పైగా నమోదవుతుండగా .. తాజాగా ఆ మార్కుకు దిగువన నమోదయ్యాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం 20,58,112 పరీక్షలు నిర్వహించగా 1,96,427 మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 14 తర్వాత అంటే 40 రోజుల తర్వాత ఈ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 2,69,48,874కు చేరగా, మరణాలు 3,07,231కి చేరాయి. ఇక యాక్టివ్ కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,782 మంది కరోనాతో బాధపడుతుండగా, యాక్టివ్ రేటు 9.60 శాతానికి చేరింది. సోమవారం 3,26,850 మంది వైరస్‌నుంచి కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,40,54,861కి చేరింది. రికవరీ రేటు 89.26 శాతానికి చేరుకుంది. గత 12 రోజులుగా కొత్త కేసులకన్నా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కరోనాపై భారత్ జరుపుతున్న పోరాటంలో ఇవి ప్రోత్సాహక సంకేతాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 592 మంది చనిపోగా, కర్నాటకలో 529 మంది, తమిళనాడులో 407 మంది, ఢిల్లీలో 207 మంది మృతి చెందారు. మరో వైపు సోమవారం నాడు 24,30,236 మంది టీకాలు తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 19,85,38,999కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 1844 ఏళ్ల మధ్య వయసు వారు12.82 లక్షల మంది టీకా తీసుకున్నారు.

India seems below 2 lakh daily cases since april 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News