న్యూఢిల్లీ: దేశంలో 2012 నుంచి 2019 మధ్యలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గిపోయినట్లు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. గాడిదల ఉపయోగం తగ్గిపోవడం, వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడం, వధించడం, గ్రాస నేల తగ్గిపోవడం తదితర కారణాల వల్ల గాడిదల సంఖ్యదేశంలో తగ్గిపోయినట్లు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ ఎక్వైన్ చారిటీ బ్రూక్‌కు చెందిన బ్రూక్ ఇండియా(బిఐ) నిర్వహించిన తాజా అధ్యయనం తేలింది. 2012—2019 మధ్యలో గాడిదల సంఖ్య ప్రధానంగా క్షీణించిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ అధ్యయనం జరిగింది. అక్షరాస్యత పెరుగుదల, ఇటుక బట్టీలలో యాంత్రీకరణ, గాడిదలకు బదులుగా గుర్రాల దత్తత తదితర కారణాలు కూడా గాడిదల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలని అధ్యయనంలో తేలింది. ఎనిమిదేళ్ల కాలంలో మహారాష్ట్రలో గాడిదల సంఖ్య 39.69 శాతం తగ్గగా ఆంధ్రప్రదేశ్‌లో 53.22 శాతం తగ్గిందని వెల్లడైంది. రాజస్థాన్‌లో 71.31 శాతం, గుజరాత్‌లో 70.94 శాతం, యుపిలో 71.72 శాతం తగ్గుదల ఉంది.
దేశంలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గుదల
- Advertisement -
- Advertisement -
- Advertisement -