- Advertisement -
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్తాన్ ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని భారత్ అందచేసింది. శుక్రవారం కాబుల్ నుంచి ఢిల్లీకి 10మంది భారతీయులు, 94మంది అఫ్ఘాన్ పౌరులు ప్రత్యేక విమానంలో తరలివచ్చారు. అదే విమానంలో కాబుల్‌కు వైద్య సరఫరాలు తరలివెళ్లాయి. కాబుల్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఓ)కు చెందిన ప్రతినిధులకు వైద్య సరఫరాలను అందచేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అఫ్ఘానిస్తాన్‌లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల దృష్టా కాబుల్ నుంచి భారతీయులు, అఫ్ఘాన్ పౌరులను తరలించిన విమానంలోనే వైద్య సరఫరాలను పంపించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. కాబుల్‌లోని ఇందిరా గాంధీ పిల్లల ఆసుపత్రిలో ఈ మందులను డబ్లుహెచ్‌ఓ అందచేస్తుందని ఒక ప్రకటనలో మంత్రిత్వశాఖ తెలిపింది.
India Send Medical Supplies to Afghanistan
- Advertisement -