- Advertisement -
న్యూఢిల్లీ: పసిఫిక్ ద్వీపకల్ప దేశమైన కిరిబస్ విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి భారత్ కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన వైద్య సరఫరాలను పంపించింది. కొవిడ్ వైద్యానికి అవసరమైన పల్స్ ఆక్సీమీటర్లు, పిపిఇ కిట్లు, అత్యవసర మందులతో కూడిన వైద్య సరఫరాలను కిరిబస్ దేశానికి పంపించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపకల దేశమైన కిరిబస్‌కు వైద్య సరఫరాలు ఎగుమతి చేయడంలో సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ అతి తక్కువ సమయంలో భారత్ స్పందించి కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలకు అండగా నిలబడాలన్న చిత్తశుద్ధిని మరోమారు నిరూపించుకుందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సమన్వయంతో వైద్య సరఫరాలతో కూడిన విమానం శనివారం కిరిబస్ చేరుకుందని విదేశాంగ శాఖ పేర్కొంది.
- Advertisement -