Thursday, December 5, 2024

వంద గంటలు.. వంద కిలోమీటర్లు

- Advertisement -
- Advertisement -

లక్నో ః వంద కిలోమీటర్ల రాదారి, వందగంటల్లో పనిపూర్తి. ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వేను రికార్డు స్థాయిలో నిర్మించారు. వంద కిలో మీటర్ల ఈ రోడ్డును అసాధారణ స్థాయిలో వంద గంటల్లోనే నిర్మించి చరిత్రకు దారి తీశారని ఢిల్లీలోని రహదారులు రవాణా, హైవే మంత్రిత్వశాఖ అధికార ప్రకటనలో తెలిపింది. దాదాపుగా కేవలం నాలుగురోజుల నాలుగుగంటల కాలంలోనే అసాధ్యాన్ని సాధ్యం చేశారు.

ఇప్పుడు మిలమిలమెరిసే విధంగా రూపొందిన ఈ రాదారి ఆరంభం ఉత్సవం నేపథ్యంలో మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన వెలువరించారు. 118 కిలోమీటర్ల పొడవైన ఈ ఎన్‌హెచ్ 34 రాదారి జనసమ్మర్థ ప్రాంతాలలో రవాణాకు ఆయువుపట్టు అవుతుందన్నారు. దేశంలో రోడ్ల నిర్మాణ వ్యవస్థలో ఇమిడి ఉన్న కాంక్రీటు సమాన అంకితభావం, నాణ్యం నిక్కమైన పనితీరు ఫలవంతానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో వినూత్న రీతి గ్రీన్ టెక్నాలజీని వాడినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News