Sunday, December 22, 2024

ఆరోగ్య రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టించాం

- Advertisement -
- Advertisement -

India setting new benchmarks in field of health says PM Modi

ప్రధాని మోడీ ట్వీట్

న్యూఢిల్లీ: కొవిడ్‌పై పోరాటంలో దేశ ప్రజల సమైక్య పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యధిక ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియలో కాని వైద్యరంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో కాని ఆరోగ్య రంగంలో భారత్ నూతన అధ్యాయాలు సృష్టిస్తోందని ప్రధాని అన్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 185 కోట్ల డోసుల మేర కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంపై మంగళవారం ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ ఆనందాన్ని పంచుకున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి 130 కోట్ల మంది భారతీయులు సాగించిన ఉమ్మడి పోరాటం నవ భారత శక్తిని చాటుతుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News