రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను తిడితే అమిత్ షా దేశంలో తిరగలేరు, అదానీ, అంబానీలను రక్షిస్తున్న మోదీ, బిజెపి, నల్లగొండ బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా పిలుపు
మన తెలంగాణ/నల్గొండ బ్యూరో : భారతదేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు మతతత్వ ఫాసిస్టు ఆర్ -బిజెపి రాజ్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లాలో సోమవారం భారీ బహిరంగసభను నిర్వహించారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులన్నీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందని, అదే స్ఫూర్తితో మరోసారి బిజెపి ఆర్ శక్తులకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించారు.
వందేళ్ళ కింద స్థా పించిన భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశానికి సం పూ ర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన మొట్టమొదటి పార్టీ అని, వలసవాదులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిందని తెలిపారు. అదే వందేళ్ళ క్రితం ఏర్పాటైన ఆర్ భారత స్వాతంత్రోద్యమంలో, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వలసవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పా ల్గొనలేదని విమర్శించారు. బిజెపి గురువు ఆర్ అని, దాని రాజకీయ విభాగమే బిజెపి అని అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి బిజెపి, ఆర్ నుంచి పెనుప్రమాదం ఏర్పడిందదని ఆందోళన వ్యక్తం చేశారు. వారి నుంచి దేశాన్ని పరిరక్షించడం, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా కాపాడుకోవడం పెద్ద సవాల్ మారిందన్నారు. బ్రిటిష్ పోర్చుగీస్ నుంచి భారతదేశాన్ని వి ముక్తి చేసినట్టే, నేడు మతతత్వ, ఫాసిస్టులు, విభజన శ క్తులైన బిజెపిను పారదోలే లక్షంగా చేసుకుని పనిచేయాల్సిన చారిత్రక కర్తవ్యం కమ్యూనిస్టులపై ఉందన్నారు.
అంబేద్కర్‌ను తిడితే అమిత్ షా దేశంలో తిరగలేరు
కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇలాగే తిడితే భారతదేశంలో తిరిగే పరిస్థితి ఉండబోదని, ప్రజలు తిరగబడతారని, పోరాటం చేస్తారని రాజా హెచ్చరించారు. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల రాజ్యాంగ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ పేదలకు, సామాన్యులకు సమానత్వం, సౌభ్రాతృత్వం ఎక్కడ ఉన్నదని, ఎక్కడ న్యాయం అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికీ క్రిస్టియన్లు, ముస్లింపై దాడులు జరుగుతున్నాయని, దళితులు, ఆదివాసీలపై అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అదానీ, అంబానీలను రక్షిస్తున్న మోదీ
అదానీ, అంబానీలను ప్రధాని మోదీ, బిజెపి రక్షిస్తోందని రాజా విమర్శించారు. అదానీ ప్రపంచ వ్యాపారవేత్తల్లోనే బిలియనీర్‌గా మారారని, ఆయనపై అమెరికా దేశంలో చార్జిషీట్ దాఖలు చేసినా, ఆయనపై చర్చకు, చర్యకు మోదీ అంగీకరించడంలేదని, ఆయనను కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ఒక వైపు వికసిత్ భారత్ అని చెబుతున్నారని, మరోవైపు పెరిగిన ధరలతో ప్రజలు బాధపడుతున్నారని, వికసిత్ భారత్ ఎక్కడ ఉన్నదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రతి పల్లె, పట్టణంలో ఎర్ర జెండా ఎగరాలె
సిపిఐ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎర్రజెండా లేని పల్లెలు, పట్టణాలు ఉండరాదని, ప్రతి గ్రామ, మున్సిపాలిటీల్లో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఎదగాలని, ఆ దిశగా కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగాలని రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభకు సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం స్వాగతం పలికారు. సమావేశానికి మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు, కె.శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, ఇ.టి.నరసింహ, వి.ఎస్. బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ మల్లేపల్లి ఆదిరెడ్డి, మాజీ ఎంఎల్ ఉజ్జని యాదగిరిరావు, సిపిఐ యాద్రాది భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యదర్శులు, ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.