Monday, March 3, 2025

కివీస్‌తో భారత్ ఓడిపోవాలి.. కోరుకుంటున్న ఫ్యాన్స్!

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి.. సెమీస్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో వరుస విజయాలతో ఉన్న కివీస్‌తో ఆదివారం తలపడనుంది భారత్. అయితే సాధారణంగా భారత్ ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే.. ఆ మ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం భారత్ ఓటమి పాలు కావాలని అభిమానులు భావిస్తున్నారట. అందుకు కారణం లేకుండా పోలేదు.

ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడాలి. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో తలపడుతుంది. మామూలు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఎలా ఆడినా.. ఐసిసి ఈవెంట్‌లు అంటే మాత్రం చెలరేగిపోతుంది. 2023 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఫైనల్‌లో షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియానే. దీంతో ఈసారి సెమీస్‌లో ఆస్ట్రేలియాకి న్యూజిలాండ్‌కి మధ్య జరగాలని అంతా కోరుకుంటున్నారు. మరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే.. ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News