Wednesday, January 22, 2025

31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో భారత్ ఒప్పందం!

- Advertisement -
- Advertisement -

అమెరికా రక్షణ సంస్థ జనరల్ అటామిక్స్ నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్‌లను భారత్ ‘ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఫ్రేమ్‌వర్క్’ కింద కొనుగోలు చేయనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. భారత నావికాదళం 15 సీ గార్డియన్ డ్రోన్‌లను పొందగా, భారత వైమానిక దళం, సైన్యం ఒక్కొక్కటి ఎనిమిది స్కై గార్డియన్ డ్రోన్‌లను అందుకోనున్నాయి.

రూ.32000 కోట్ల ఒప్పందం కింద, భారతదేశంలో నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర సదుపాయం కూడా ప్రారంభించబడుతుంది. సీనియర్ అధికారుల సమక్షంలో ఇరు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. గత వారం 31 ప్రిడేటర్ డ్రోన్‌ల కొనుగోలుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్టుల సంతకాల కోసం అమెరికా మిలిటరీ, కార్పొరేట్ అధికారుల బృందం భారత్‌లో ఉంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News