Wednesday, November 6, 2024

చైనా నుంచి సోలార్ దిగుమతులు తగ్గించిన భారత్‌

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ పోకడలను విడిచిపెట్టి భారత్ స్వదేశీయంగా సోలార్ మాడ్యూల్ తయారీలో స్వయం సామర్థం వైపు దృష్టి మళ్లించడంతో చైనా నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2023 మొదటి ఆరు నెలల్లో చైనా నుంచి భారత్‌కు 76 శాతం వరకు సోలార్ మాడ్యూల్ దిగుమతులు తగ్గినట్టు విశ్లేషణలు చెబుతున్నాయి. ఈమేరకు ఇంధనంకు సంబంధించి ప్రపంచ మేథోనిధి “ఎంబర్‌” తాజా నివేదిక గురువారం విడుదలైంది. ఏడాది నుంచి ఏడాదికి ఈ దిగుమతులు భారీ తగ్గుతున్నాయి. 2022 మొదటి అర్ధ సంవత్సరంలో చైనా నుంచి భారత్‌కు 9.8 గిగావాట్ సోలార్ మాడ్యూల్ దిగుమతి కాగా, 2023 అదే కాలంలో దిగుమతులు కేవలం 2.3 గిగావాట్‌కు తగ్గిపోయాయి. దిగుమతులపై ఆధారపడడం చాలా వరకు తగ్గించి స్వదేశీ తయారీ సామర్ధాన్ని విశేషంగా ప్రోత్సహించాలన్న సంకల్పంతోపాటు సుంకాల విధింపు వల్ల ఈ వ్యూహాత్మక మలుపు సంభవించింది.

ఎంబర్‌కు చెందిన భారత విద్యుత్ విధాన విశ్లేషకులు నెష్విన్ రోడ్రిగ్స్ భారత్ 2022 తరువాత చైనా నుంచి సోలార్ మాడ్యూల్ దిగుమతులను గణనీయంగా తగ్గించుకుందని దీనివల్ల స్వదేశీ తయారీ ఊపు అందుకుందని పేర్కొన్నారు. సోలార్ మాడ్యూల్స్ , సెల్స్ తయారీలో భారత్ స్వయం సామర్ధాన్ని పెంపొందించుకుంటున్నా, చైనా దిగుమతులపై ఇక ఆధారపడే పరిమితి లేకున్నా ఇప్పుడు కీలకమైనది సోలార్ సంస్థాపక సామర్థం సాధించుకోవడమని వివరించారు. జాతీయ విద్యుత్ ప్రణాళికకు అనుగుణంగా సోలార్ సంస్థాపక సామర్ధం అవసరమని పేర్కొన్నారు. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించుకోవాలన్నలక్షంతో 2030 నాటికి శిలాజేతర ఇంధనాల వనరులతో 500 గిగావాట్ విద్యుత్ వ్యవస్థీకృత సామర్ధాన్ని భారత్ సాధించవలసి ఉంది. ఈ లక్ష సాధనకు సౌర విద్యుత్ ఆయువు పట్టు. అయితే ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 2023 మొదటి అర్థసంవత్సరంలో చైనా నుంచి సోలార్ ప్యానెళ్ల ఎగుమతులు 3 శాతం వరకు పెరిగాయి. ఈమేరకు 114 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్ చైనా నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యాయి. సోలార్ ప్యానెల్ తయారీ ప్రపంచ మార్కెట్‌లో చైనాదే పైచేయి. ప్రపంచ మార్కెట్‌లో 80 శాతం మార్కెట్ షేర్ చైనాదే అని ఈ నివేదిక వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News