Wednesday, January 22, 2025

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్రేచ్ఛ సూచిలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరింత కిదకు జారింది. మొత్తం 180 దేశాల జాబితాను ప్రపంచ మీడియా నిఘా సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ బుధవారం వెల్లడించింది. 2021లో భారత్ స్థానం 142 ఉంది. బంగ్లాదేశ్(163), మయన్మార్(173), చైనా(179) మినహాయిస్తే మిగిలిన పొరుగుదేశాలన్నీ భారత్ కన్నా మెరుగైన స్థానంలోనే ఉన్నాయి. భూటాన్ 90వ స్థానం, నేపాల్ 95వ స్థానం, శ్రీలంక 135వ స్థానం, పాకిస్తాన్ 150వ స్థానం, అఫ్ఘానిస్తాన్ 152వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి ప్రకారం..2022తో పోలిస్తే పాకిస్తాన్(157), అఫ్ఘానిస్తాన్(156) స్థానాలు మెరుగుపడ్డాయి. రాజకీయ, శౠసనపర, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక, జర్నలిస్టుల భద్రత అనే ఐదు అంశాల ఆధారంగా ఈ సూచిని రూపొందిస్తారు.

Also Read: కారు రూఫ్‌పై ఎగిరిపడ్డ బైకర్: 3 కి.మీ. ప్రయాణం.. గాయాలతో మృతి

రాజకీయ సూచికలో భారత్ 169 స్థానంలో ఉంది. శాసవ్యవస్థల సూచికలో 144 స్థానంలో ఆర్థిక సూచికలో 155 స్థానంలో, సామాజిక సూచికలో 143 స్థానంలో, జర్నలిస్టులకు భద్రతలో 172వ స్థానంలో భారత్ ఉంది. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పాలిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందనడానికి జర్నలిస్టులపై జరుగుతున్న హింస, పక్షపాత మీడియా, మీడియాపై గుత్తాధిపత్యం వంటివి నిదర్శనమని నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛలో నార్వే వరుసగా ఏడడవ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాలలో ఐర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్‌ల్యాండ్ ఉన్నాయి. బ్రిటన్ 26వ స్థానంలో ఉండగా అమెరికా 45వ స్థానంలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News