Thursday, January 23, 2025

ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్

- Advertisement -
- Advertisement -
Hunger India
పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కన్నా వెనుకబడ్డ భారత్!

న్యూఢిల్లీ:  పేదలు దేశంలో ఎక్కువ మందే ఉన్నారనేందుకు  నిదర్శనం అంతర్జాతీయ ఆకలి సూచీ 2022 ర్యాంకులే. గత ఏడాదితో పోలిస్తే భారత్ ఆరు స్థానాలు దిగజారి 107వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 121 దేశాలతో ఈ సూచీ ర్యాంకుల నివేదిక విడుదలైంది. అంతర్జాతీయ ఆకలి సూచీ ర్యాంకు కేటాయింపునకు ప్రధానంగా చూసే అంశాలు.. పోషకాహార లేమి (కావాల్సినన్ని కేలరీలు లభించకపోవడం), చిన్నారుల మరణాలు, వృద్ధి సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడం వంటివి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క ప్రచురణకర్తలు – యూరోపియన్ ఎన్‌జిఓలు కన్సర్న్ వరల్డ్‌వైడ్ అండ్ వెల్తుంగర్‌హిల్ఫ్- ఆకలి స్థాయిని “తీవ్రమైనది” అని పేర్కొంది.

దక్షిణాసియా దేశాల్లో అప్ఘానిస్థాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.  పాకిస్థాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ కంటే దిగువన ఉన్న దేశాల్లో జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలున్నాయి.  ఎనిమిదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో 2014 నుంచి భారత్‌ స్కోరు మరింత దిగజారిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అన్నారు. ‘‘హిందుత్వం, హిందీని రుద్దడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఆకలికి విరుగుడు కాదు’’ అని చిదంబరం తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడం గురించి బిజెపి ఉత్తుత్తి ప్రసంగాలు చేస్తోంది,  అయితే 106 దేశాలు “రోజుకు రెండు పూటల భోజనం అందించడంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయని” ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News