Wednesday, January 22, 2025

భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 96 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న డీన్ ఎల్గార్ జోరుకు శార్దూల్ ఠాకూర్ కళ్లెం వేశాడు. ఎల్గార్ 185 పరుగుల వద్ద శార్దూల్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జాన్సేన్ 60 పరుగులతోను, గెరాల్డ్ కోజీ ఐదు పరుగులతోను ఆడుతున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News