Sunday, January 19, 2025

భారత్-సౌతాఫ్రికా సెమీస్ పోరు నేడు

- Advertisement -
- Advertisement -

బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికాతో జరిగే పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఆదర్ష్ సింగ్, కెప్టెన్ ఉదయ్ శరణ్, ముషీర్ ఖాన్, అర్షిన్ కుల్‌కర్ణి, ప్రియాన్షు, సచిన్ దాస్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అంతేగాక సౌమీ పాండే రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. భారత్ విజయాల్లో సౌమీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న భారత్ మరోసారి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సొంత గడ్డపై టోర్నీ జరుగుతుండడంతో సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. సఫారీ టీమ్‌లోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News