Saturday, December 28, 2024

దక్షిణాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్… విధ్వంసకర ఓపెనర్‌కు చోటు లేదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టి20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇవాళ తొలి టి 20 మ్యాచ్ ఉండడంతో జట్టులో ఎవరు ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆస్ట్రేలియా సిరీస్ దూరంగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చారు. దీంతో టీమిండియా జట్టులో ఎవరికి చోటు దక్కుతుందని కసరత్తు జరుగుతుంది. ఓపెనర్‌గా శుభ్‌మన్‌గిల్‌కు తోడుగా రుతురాజ్ గైక్వాజ్ వచ్చే అవకాశాలు ఉండడంతో యశస్వీ జైస్వాల్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తారు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, సెకండ్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తారు. తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితం కావడంతో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టులో ఉంటాడు. ఇషాన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రింకు సింగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. బౌలర్లుగా ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లకు చోటు లభించే అవకాశం ఉంది.

టీమిండియా టి20 జట్టు: రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, ఇషాన్ కిషన్(కీపర్), రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News