Sunday, December 22, 2024

ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల బోర్డర్‌గవాస్కర్ సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించారు. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. సిరీస్ కోసం 18 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, జస్‌ప్రిత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అభిమన్యు ఈశ్వరన్, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణాలకు జట్టులో చోటు లభించింది. అంతేగాక సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు.
టెస్టు జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా, జైస్వాల్, అభిమన్యు, గిల్, కోహ్లి, రాహుల్, రిషబ్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్, వాషింగ్టన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News