Friday, November 22, 2024

ఉగ్రవాదంపై శ్రీలంక-భారత్ సంయుక్త పోరాటం : జై శంకర్

- Advertisement -
- Advertisement -

India- Sri Lanka joint fight against terrorism: Jai Shankar

కొలంబో : తీవ్రవాదం, హింస, సైబర్ నేరాలు, అంతర్జాతీయ నేరాలు, డ్రగ్స్‌సరఫరా వంటి తీవ్రమైన సమస్యలపై భారత్ శ్రీలంకలు సంయుక్తంగా పోరాడాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ పిలుపునిచ్చారు. కొలంబోలో మంగళవారం బిమ్స్‌టెక్ ( బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ ) సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎనర్జీ, కనెక్టివిటీ వంటి అంశాల్లో సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బిమ్స్‌టెక్ దేశాల మధ్య త్వరలోనే వ్యాపార అవకాశాలను పెంచడంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టులు చేపడతామని, తీరప్రాంత రవాణా , పోర్టు సేవలు, గ్రిడ్ కనెక్టివిటీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. బంగాళాఖాతంపై ఆధారపడిన భారత్, శ్రీలంక, నేపాల్,భూటాన్, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్‌లు బిమ్స్‌టెక్‌లో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థిక, సాంకేతిక రంగాలతో పాటు ఇతర అంశాల్లో పరస్పర సహకారం కోసం బిమ్స్‌టెక్ ఏర్పడింది. బిమ్స్‌టెక్ 18 వ సదస్సు ఇప్పుడు శ్రీలంక లోని కొలంబోలో జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News