Sunday, September 8, 2024

షాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఎన్నిక ల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర అలజడికి లోనయ్యాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ఆశించిన మేరకు సీట్లు సాధించకపోవడంతో మార్కెట్లు పేక మేడలా కుప్పకూలిపోయా యి. మార్కెట్‌లో అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో భారతీయ స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడనంత భారీ పతనాన్ని చవిచూసింది. మార్కెట్ పతనంతో ఒక్క రోజే ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు నష్టపోయారు. మార్కెట్‌లో అత్యధికంగా పతనమైన స్టాక్స్‌లో అదానీ గ్రూప్ చెందినవే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ కంపెనీల షేర్లలో కూడా భారీ క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 4389.73 పాయింట్ల (5.74 శాతం) న ష్టంతో 72,079 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1379.40 పాయింట్ల (5.93 శాతం) పతనంతో 21,884.50 పాయింట్ల వద్ద స్థిరపడింది.

భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం కారణంగా ఒక్కరోజులో ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. మంగళవారం బిఎస్‌ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ రూ.395.42 లక్షల కోట్ల వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.426 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్‌లో మొత్తం 3,934 స్టాక్స్ ట్రేడ్ అవగా, 3,349 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. 488 షేర్లు మాత్రమే పెరిగాయి. 97 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 25 క్షీణించగా, 5 స్టాక్స్ పెరిగాయి. ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ షేర్లు దాదాపు 15 శాతం పడిపోయాయి. ఎల్ అండ్ టి, పవర్ గ్రిడ్ షేర్లు 12 శాతానికి పైగా తగ్గాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు దాదాపు 5.74 శాతం పెరిగాయి.

ఇంధన రంగం స్టాక్స్ కుదేలు
మార్కెట్‌లో అతిపెద్ద క్షీణత ఇంధన రం గం స్టాక్‌లలో కనిపించింది. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ 12.47 శాతం లేదా 5357 పాయింట్ల పతనంతో ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా నిఫ్టీ బ్యాం కింగ్ ఇండెక్స్ 7.95 శాతం లేదా 4051 పాయింట్లు నష్టపోయింది. దీంతో పాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయి ల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఆటో, ఐటి, ఫార్మా రంగాల షే ర్లు కూడా నష్టాలతో ముగిశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు అత్యధిక పతనం చూశా యి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4,202 పా యింట్లు (7.88 శాతం) పతనంతో ముగియగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1,406 పాయింట్లు (8.23 శాతం) పతనంతో ముగిసింది.
కరోనా సమయంలో 5.94% పతనం
మే 2020 తర్వాత మార్కెట్‌లో ఇదే అతిపెద్ద ప తనం, అప్పుడు కరోనా కారణంగా మార్కెట్ 5.94 శాతం పడిపోయింది. 202 ఏప్రిల్ 30న సెన్సెక్స్ 33,717 స్థాయిలో ఉంది, ఇది మే 4న 2002 పా యింట్లు తగ్గి 31,715కి పడిపోయింది. స్టాక్ మార్కెట్ 2020 మే 1, 2, 3 తేదీలలో మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News