Friday, November 22, 2024

టార్గెట్ చైనా….

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కవ్వింపుల నేపథ్యంలో భారత్ గురువారంనాడు కీలక పరీక్షకు పూనుకుంది. 5,400 కిలో మీటర్ల దూరం లోని లక్షాలను ఛేదించగల అగ్ని5 అణ్వాయుధ సామర్థం గల బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం జరిపినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ క్షిపణి చైనాలోని ప్రతి మూలను తాకగలదు. గతంలో కంటే ఇప్పుడు తేలికైన క్షిపణిలో కొత్త సాంకేతికతలు, పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష జరిగింది.

అవసరమైతే అగ్ని5 పరిధిని పెంచే సామర్థాన్ని ఈ ట్రయల్ నిరూపించిందని వివరించాయి. ఈ క్షిపణి దాదాపు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు , 50 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఒకటన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్ల గలదు. అరుణాచల్ లోని సరిహద్దులో మరోసారి చైనా కవ్వింపు చర్యలకు దిగుతున్నవేళ తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. అగ్నిరకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించింది. ఇది తొమ్మిదో అగ్నిక్షిపణి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News