Monday, December 23, 2024

‘ప్రళయ్’ పరీక్ష సక్సెస్

- Advertisement -
- Advertisement -

బాలాసోర్ : ఉపరితలం నుండి ఉపరితలానికి దూసుకువెళ్లే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ ప్రళయ్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుండి మంగళవారం ఉదయం 9.50 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) అభివృద్ధి చేసింది. 350 నుండి 500 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ప్రళయ్ చేధించగలదని, దీని పేలోడ్ కెపాసిటీ 500 నుంచి 1000 కిలోలు ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. నియంత్రణ రేఖ(ఎల్‌ఒసి), వాస్తవాదీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద ఈ క్షిపణిని మోహరించనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News