బాలాసోర్ (ఒడిశా) : వ్యూహాత్మక అగ్ని ప్రైమ్ క్షిపణిని శనివారం భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో కొత్తతరం అత్యాధునిక రూపాంతరం గల అగ్నిపి అనే ఈ క్షిపణిని ఒడిశా తీరం లోని బాలాసోర్ వద్ద పరీక్షించారు. దీనికి 1000 నుంచి 2000 కిలో మీటర్ల లక్షాలను ఛేదించే సామర్ధం ఉంది. ఈ క్షిపణికి కొత్త ఫీచర్లను అనుసంధానం చేసి పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. క్షిపణి అధిక స్థాయి కచ్చితత్వంతో లక్షాన్ని ఛేదించినట్టు తెలిపారు. ఈ ఏడు జూన్ 28న ఈ క్షిపణిని చివరిసారిగా పరీక్షించగా, శనివారం జరిపిన పరీక్ష ద్వారా క్షిపణి పూర్తి స్తాయి అభివృద్దికి చేరువైందని, త్వరలో సైన్యంలో ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. అత్యాధునికి సాంకేతికత సామర్ధాలను ప్రయోగించడం ద్వారా దేశం వ్యూహాత్మక క్షిపణుల ఆయుధాగారాన్ని మరింత బలోపేతం చేసే పనిలో ఉంది. ఇటీవల అగ్ని5 క్షిపణిని కూడా దేశం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే.
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
- Advertisement -
- Advertisement -
- Advertisement -