- Advertisement -
న్యూఢిల్లీ: యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి హెలీనా రెండవ పాటవ పరీక్షను మంగళవారం హెలికాప్టర్ ద్వారా విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొదటి పాటవ పరీక్ష సోమవారం విజయవంతంగా జరిగినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యంత అధునాతన తేలికపాటి హెలికాప్టర్ల నుంచి హెలీనా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. నేటి పరీక్షలు వేరే రేంజ్ నుంచి, ఎత్తు నుంచి జరిపినట్లు తెలిపింది. నిర్దేశిత లక్ష్యాన్ని గురి తప్పకుండా హెలీనా ఛేదించిందని రక్షణ శాఖ వివరించింది. సీనియర్ సైనిక కమాండర్లు, డిఆర్‌డిఓ సైంటిస్టులు ఈ పరీక్షలను వీక్షించినట్లు తెలిపింది. హెలీనా పాటవ పరీక్షలు విజయవంతం అయినందున ఈ క్షిపణిని భారత సాయుధ దళాలలో ఇక ప్రవేశపెట్టవచ్చని రక్షణ శాఖ పేర్కొంది.
- Advertisement -