Tuesday, November 5, 2024

పసికట్టు… పనిపట్టు

- Advertisement -
- Advertisement -

India successfully tests Akash NG missile

ఆకాశ్ క్షిపణి సక్సెస్

బాలాసోర్ (ఒడిశా) : అత్యంత వేగంతో గగనతలంలో వెళ్లే శత్రు వాహనాలను పసికట్టి, నేలకూల్చే సరికొత్త శ్రేణి ఆకాశ్ ఎన్‌జి క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ ఉపరితల గగనతల క్షిపణిని శుక్రవారం ఒడిశా తీరం వెంబడి ఉన్న చాంధీపూర్ ఐటిఆర్ ప్రయోగకేంద్రం నుంచి పరీక్షించి చూసినట్లు భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ఓ ప్రకటనలో తెలిపింది. దూర ప్రాంతంలో గగనతలంలో అతివేగంగా సంచరించే మానవరహిత టార్గెట్ వెహికల్‌ను ఏర్పాటు చేసుకుని , దీనిని ఈ క్షిపణి ద్వారా గుర్తించడం, క్షణాల వ్యవధిలో గురిచూసుకుని దెబ్బతీయడం జరిగిందని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా దీనిని విజయవంతంగా పరీక్షించి చూశారు.

ఈ అధునాతన మిస్సైల్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ గ్రాహకం ఉంది. దీని ద్వారా వెలువడే సిగ్నల్స్‌తో గగనతల టార్గెట్‌ను దెబ్బతీయగలిగారు. ఈ క్షిపణి వ్యవస్థను హైదరాబాద్‌లోని డిఆర్‌డిఎల్ సాంకేతిక సిబ్బంది రక్షణసంస్థకు చెందిన డిఆర్‌డిఒ ల్యాబ్‌ల సహకారంతో ఈ క్షిపణిని రూపొందించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్ వద్ద గగనతలంలో డ్రోన్లు, ఇతరత్రా గుర్తు తెలియని వస్తువులు విధ్వంసానికి యత్నిస్తున్న దశలో వీటిని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ క్షిపణి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్షిపణిలోని వ్యవస్థల ద్వారా శత్రువును పసికట్టడం, ఇదే తరుణంలో దీనిని స్తంభింపచేయడం, ఆ వెంటనే దీనిని దెబ్బతీయడం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News