Friday, January 10, 2025

సిక్కులపై దాడులు… పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సిక్కులపై పాకిస్థాన్‌లో పెరుగుతున్న దాడులను భారత్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు న్యూఢిల్లీ లోని పాకిస్థాన్ హైకమిషన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. సిక్కులపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని, సాధ్యమైనంత త్వరగా విచారణ నివేదికను అందజేయాలని అడిగింది. సరిహద్దుల్లో తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే దాడులకు వెనుకాడేది లేదంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్ములో సోమవారం పాక్‌ను హెచ్చరించిన నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాక్‌లో ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య సిక్కులపై నాలుగు సార్లు దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. మతపరమైన వేధింపులతో పాక్ లోని మైనార్టీలు నిరంతరం అభద్రతకు గురవుతున్నారని, వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని భారత్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News