Thursday, April 24, 2025

ఉగ్రదాడి.. పాక్‌ దౌత్యవేత్తకు భారత్ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందినవారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు పంపించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్ వారాయిచ్‌ను పిలిపించి, తన సైనిక దౌత్యవేత్తలకు అధికారిక పర్సోనా నాన్ గ్రాటా నోట్‌ను అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నోటీసుల ప్రకారం.. ఒక వారంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుందని  భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. కాగా, మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News