Friday, November 15, 2024

అఫ్ఘాన్‌కు భారత్ 5 లక్షల డోసుల కోవ్యాక్సిన్ సరఫరా

- Advertisement -
- Advertisement -

India supplies 5 lakh doses of vaccine to Afghanistan

 

న్యూఢిల్లీ: తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్ఘానిస్తాన్‌కు మానవతా సహాయం కింద 5 లక్షల డోసుల కోవ్యాక్సిన్‌ను భారత్ శనివారం సరఫరా చేసింది. కాబుల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి వ్యాక్సిన్ డోసుల కన్‌సైన్‌మెంట్‌ను అందచేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. రానున్న వారాలలో మరో 5 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను అఫ్ఘానిస్తాన్‌కు సరఫరా చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్ఘాన్ ప్రజలకు మానవతా సహాయం కింద ఆహార ధాన్యాలను, 10 లక్షల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను, ప్రాణరక్షక ఔషధాలను అందచేయాలన్నదే తమ లక్షమని తెలిపింది. రానున్న వారాలలో అఫ్ఘాన్‌కు గోధుమలు, మిగిలిన వైద్య సహాయాన్ని సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయం ఐక్యరాజ్య సమితితో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News