- Advertisement -
పాకిస్థాన్‌తో 1960 నాటి సింధూ జలాల ఒప్పంద రద్దు సంబంధిత అమలు ప్రకటనను భారత ప్రభుత్వం శుక్రవారం వెలువరించింది.దీనితో ఇక ఒప్పందం రద్దు అధికారికం అయింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయి చర్యలకు దిగుతోంది. అప్పటి ఒడంబడికను తక్షణ రీతిలో నిలిపివేయడం జరుగుతోంది.ఈ విషయంలో సంబంధిత అధికారులు, యంత్రాంగం తగు విధంగా చర్యలు చేపడుతుందని ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల మధ్య పలు దఫాల చర్చల తరువాత అత్యంత కీలకమైన జల పంపిణి సంబంధిత సింధూ ఒప్పందం 1960లో కుదిరింది. అయితే ఉగ్రయుద్థానికి పాల్పడుతున్న పొరుగుదేశంతో ఇటువంటి ప్రయోజనకర ఒప్పందాల కొనసాగింపు అర్థరహితం అవుతుంది, బలహీనతగా చిత్రీకరిస్తారని, అందుకే ఈ రద్దు చర్య చేపట్టినట్లు, క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకువస్తున్నట్లు అదికారిక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -