Monday, December 23, 2024

టి20 ప్రపంచ కప్ కు భారత జట్టు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: బిసిసిఐ ప్రపంచ కప్ కు భారత జట్టును ప్రకటించింది. సెక్రటరీ జయ్ షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమావేశమయ్యాక జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించారు. ఇటీవల కాలంలో పెద్ద ప్రదర్శన చూపకపోయినప్పటికీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శామ్సన్ ను సెకెండ్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. ప్రధాన వికెట్ కీపర్ మటుకు రిషభ్ పంత్. లెగ్ స్పిన్నర్ చాహల్, స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ లను కూడా జట్టులోకి తీసుకున్నారు. బాగా హిట్స్ కొట్టే బ్యాట్స్మన్ శివం దుబేను కూడా జట్టులోకి తీసుకున్నారు. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమ్ గిల్, కోల్ కతా నైట్ రైడర్స్ హిట్టర్ రింకూ సింగ్, ఖలీల అహ్మద్, ఆవేశ్ ఖాన్ లను స్టాండ్ బైలుగా(ఎక్స్ ట్రాలుగా) తీసుకున్నారు.

టి20 వరల్డ్ కప్ కు భారత జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దుబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్.

రిజర్వ్స్ : శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.

రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ తుది 15 మంది జట్టును అనౌన్స్ చేశాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News