Wednesday, January 22, 2025

దౌత్యపరమైన ఉనికిపై కెనడాతో భారత్ చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దౌత్యపరమైన ఉనికిలో సమానత్వం సాధించడం కోసం కెనడాతో చర్చలు కొనసాగిస్తున్నట్టు భారత్ గురువారం ప్రకటించింది. భారత్‌లో కెనడా దౌత్యపరమైన ఉనికిలో సమానత్వం సాధించడం కోసం చర్చలు జరుగుతున్నాయని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చీ వెల్లడించారు. భారత్‌లో కెనడా తన దౌత్యపరమైన ఉనికిని తగ్గించడంపై రెండు వారాల క్రితం కెనడాను భారత్ ప్రశ్నించింది. కెనడా ప్రధాని ట్రూడో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించడంతో భారత్, కెనడా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి, ఉద్దేశపూర్వకమైనవిగా భారత్ కొట్టిపారేసింది. ఈ కేసుకు సంబంధించి భారత అధికారిని ఒకరిని కెనడా బహిష్కరించిన తరువాత దానికి జవాబుగా సీనియర్ కెనడా దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News