Monday, December 23, 2024

ఇండియా టార్గెట్ 160

- Advertisement -
- Advertisement -

గయానా: ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఉంచింది. రోవ్‌మాన్ పొవెల్ 19 బంతుల్లో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. కైల్ మేయర్స్ 20 బంతుల్లో 25 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాన్సన్ చార్లెస్ 12 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. బ్రాండన్ కింగ్ 42 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. నికోలస్ పూరన్ 20 పరుగులు చేసి కల్దీప్ యాదవ్ బౌలింగ్ స్టపౌంట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News