Monday, December 23, 2024

భారత్ లక్ష్యం 150

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళల టి20 ప్రపంచ్ కప్ లో భాగంగా ఇవాళ కేప్ టౌన్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నిలకడగా ప్రారంభించింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ కు చేరారు. దీంతో ఏడు ఓవర్లకు 42/2 గా ఉంది.

74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పాకిస్థాన్ బిస్మా(68), అయేషా(43) ఆదుకున్నారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ కు చెరో వికెట్ దక్కింది.దీంతో 150 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News