Thursday, November 28, 2024

జలాంతర్గామి నుంచి కె-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ కు చెందిన వ్యూహాత్మక అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ ద్వారా కె4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరిగింది. విశాఖ తీరంలో భారత నౌకా దళం దీనిని నిర్వహించింది. అరిఘాగ్ నుంచి కె4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. 3500 కిమీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా నిర్వహించిన ఈ ప్రయోగం ఫలితాలను విశ్లేషిస్తున్నారు.

ఐఎన్ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం అయిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లోని ‘నౌకా నిర్మాణ కేంద్రం’ లో 2011 డిసెంబర్ లో చేపట్టారు. నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జలప్రవేశం చేయించారు. తర్వాత అంతర్గత పరికరాలు బిగించారు. ఆధునిక సాంకేతిక రాడార్ వ్యవస్థను అమర్చారు.

ప్రపంచవ్యాప్తంగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగల జలాంతర్గాములు ఉన్న దేశాల్లో భారత్ ఆరోది. అమెరికా, రష్యా, యూకె, ఫ్రాన్స్, చైనా వంటివి ఇతర దేశాలు. చైనాను దృష్టిలో పెట్టుకుని భారత్ 3500 కిమీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను రూపొందించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News