Monday, January 20, 2025

ఇండియా మూడో భేటీ సెప్టెంబర్‌లో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ ఇండియా ’ మూడో భేటీ సెప్టెంబర్‌కు వాయిదా పడింది. ముంబైలో ఈ సమావేశాన్ని ఆగస్టు 25, 26 తేదీలలో జరపతలపెట్టారు. అయితే ఈ తేదీలలో తాము హాజరుకాలేమని కొందరు విపక్ష నేతలు తెలియచేశారు. దీనితో సెప్టెంబర్‌కు ఈ సమావేశం వాయిదా పడిందని సంబంధిత వర్గాలు శనివారం తెలిపాయి. చీలికల ప్రభావం పడ్డ ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఆగస్టు మధ్యలో మహారాష్ట్ర పర్యటనకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఆయన ఆగస్టులో ఇండియా భేటీకి హాజరు అయ్యే పరిస్థితి లేదు.

ఇదే విధంగా ఇతర పార్టీల నేతలు కొందరు కూడా వేరే కార్యక్రమాలలో ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఇండియా భేటీని సెప్టెంబర్‌కు మార్చినట్లు వెల్లడైంది. అయితే ఇప్పటికీ ఆగస్టు చివరిలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అయితే అనివార్య పరిస్థితుల నడుమ కొత్త తేదీలను ఎంచుకుంటున్నట్లు ఇండియా కూటమికి చెందిన సీనియర్ నేత ఒకరు ముంబైలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News