అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను షేక్ చేస్తే.. భారత బౌలర్లు బాలత్‌తో ఆతిధ్య బ్యాటర్లను వణికించారు. దీంతో చివరి వన్డేలో భారత్ భారీ విజయం సాధించింది. 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 41తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్, పించ్ హిట్టర్ అభిషేక్ శర్మ(135: 54 బంతుల్లో 7×4, 13×6) చుక్కలు చూపించాడు. ఏకంగా 13 సిక్సర్లు బాది వాంఖడే స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారింది. అతని తోడు శివం ధూబె(30) సైతం బ్యాట్ ఝలిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి 10.3 ఓవర్లలోనే 97 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టులో ఫిలిప్ సాల్ట్(55) ఒక్కడే ఆర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగితావరెవరూ రాణించలేక పోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఇంగ్లండ్ 150 పరుగుల తేడా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
అభిషేక్ సరికొత్త రికార్డు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరే రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్‌తో 13 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో సెంచరీ బా దాడు. టీ20ల్లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20ల్లో టీమిండియా తరఫున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. అతడు 35 బంతుల్లోనే శతకొట్టాడు. 2017లో శ్రీలంకపై ఈ ఫీట్ నమోదు చేశాడు. మొ త్తంగా టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా) పేరిట ఉంది. 27 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను టచ్ చేశాడు.
ఇక ఇదే మ్యాచ్ లో 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ శర్మ. టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) తర్వాత అభిషేక్‌దే ఫాస్టెస్ట్ ఫిఫ్టి. అభిషేక్ కు టీమిండియా తరఫున గత 16 ఇన్నింగ్స్ లో ఇది నాలుగో ఫిఫ్టీ ప్లస్ కావడం విశేషం. మొత్తం మీద 188 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 450 పరుగులు చేశాడు అభిషేక్. అభిషేక్ విధ్వంసం ధాటికి పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లలో) అత్యధిక స్కోర్ నమోదు చేసింది టీమిండియా. మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగుల స్కోర్ చేసింది.