Sunday, December 22, 2024

భారత మహిళల శుభారంభం

- Advertisement -
- Advertisement -

ఇక్కడ జరుగుతున్న ఆసియా విమెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. దూకుడైన ఆటతో గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆట 8వ నిమిషంలోనే భారత్ ప్రయత్నం ఫలించింది. సంగీత కుమారి అద్భుత గోల్‌ను నమోదు చేసింది. దీంతో భారత్ 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మలేసియా తీవ్రంగా శ్రమించింనా పలితం లేకుండా పోయింది. 43వ నిమిషంలో ప్రీతి దూబె భారత్‌కు రెండో గోల్‌ను సాధించి పెట్టింది. తర్వాతి నిమిషంలోనే ఉడితా భారత్‌కు మూడో గోల్ అందించింది. తర్వాత భారత్ మరింత మెరుగ్గా ఆడింది. ఆట 55వ నిమిషంలో సంగీత కుమారి తన రెండో గోల్‌ను నమోదు చేసింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 40తో ఘన విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News