Saturday, November 23, 2024

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

India thrashed Pakistan by 31 goals

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ

ఢాకా: ప్రతిష్టాత్మకమైన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 31 గోల్స్ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఎటాకింగ్ గేమ్‌తో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా, ఆకాశ్‌దీప్ సింగ్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో తనవంతు పాత్ర పోషించాడు. ఇక విజయంతో భారత్ నాకౌట్ ఆశలు మరింత మెరుగయ్యాయి. ప్రథమార్ధం ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఇక తొలి హాఫ్‌లో భారత్ 10 ఆధిక్యంలో నిలిచింది.

ద్వితీయార్ధంలో కూడా భారత్ జోరును ప్రదర్శించింది. 41వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్‌ను సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను షాక్‌కు గురిచేస్తూ ఆకాశ్‌దీప్ ఈ గోల్ నమోదు చేశాడు. అయితే కొద్ది సేపటికే పాకిస్థాన్ తొలి గోల్‌ను సాధించింది. జునేద్ ఈ గోల్‌ను సాధించాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించింది. అయితే పటిష్టమైన డిఫెన్స్ భారత్ ప్రత్యర్థి జట్టు దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఇక కొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేశాడు. ఇక ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న భారత్ 31 గోల్స్ తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాతో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన భారత్ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ఇక శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కూడా చిత్తు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News