హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు కరీబియన్ దీవులకు పయనమయ్యాయి. 15 మందితో కూడిన టీమిండియా జట్టు సభ్యులు కరీబియన్ దీవులలో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు , మరో ఇద్దరు స్పెషలిస్టు బౌలర్లతో భారత్ బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. టీమిండియాతో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్టేలియా జట్లు టి20 వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతన్నారు.
తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ టీమిండియా జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో సారి టి20 వరల్డ్ కప్ గెలుద్దామనుకున్న ఆస్ట్రేలియా జట్టుకు భారత్ నుంచి ముప్పు ఉందని తెలిపారు. టీమిండియా ప్రస్తుతం స్పిన్‌తోనే దాడి చేయడానికి రెడీగా ఉందని, ఆస్ట్రేలియా జట్టులో భిన్నమైన ఆటగాళ్లు ఉన్నారని, వరల్డ్ కప్ గెలువాలనుకునే జట్లకు టీమిండియా పెనుముప్పుగా మారిందన్నారు.
ఈ సారి ఎవరు ఫేవరెట్ అని చెప్పలేమని, కప్ గెలిచే జట్లలో టీమిండియా ఒకటిగా ఉందని క్లార్క్ తెలియజేశారు. భారత జట్టు ఇప్పటి వరకు టి20లో చాలా క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, మిగిలిన టీమ్‌లతో పోలిస్తే వారి సన్నదత బాగుందని కొనియాడారు. విండీస్-భారత్ మధ్య పరిస్థితులు భిన్నంగా ఉన్నా కూడా పోలికలు మాత్రం ఒకటేనని క్లార్క్ చెప్పారు. భారత క్రికెటర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరణ ఇచ్చారు.