Sunday, January 19, 2025

డోర్సే ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైతుల ఉద్యమం సమయంలో ఉద్యమాన్ని సమర్థించే వారి ఖాతాలను తొలగించకపోతే ట్విట్టర్‌ను మూసి వేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సే చెప్పిన తర్వాతనైనా ప్రభుత్వం సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడాన్ని ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు డోర్సే వెల్లడించిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది. వ్యవస్థలను బలహీనం చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి ఇంతకు మించిన సాక్షం మరోటి లేదని పేర్కొంది.‘ప్రభుత్వం సోషల్ మీడియాను అణచివేయడం ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, లొంగిపోవలసిందిగా మీడియాలోని పెద్ద వర్గాలను అణచివేయడం, బెదిరించడాన్ని నిలిపివేయాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

ప్రతిపక్షాల గొంతుకను ప్రభుత్వం రెగ్యులర్‌గా అణచివేస్తోందని కూడా ఆమె అన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ రాహుల్ గాంధీ ఖాతాను నిషేధించిందని ఆమె అంటూ డోర్సే ప్రకటన తర్వాత వాస్తవం బైటికి వచ్చిదన్నారు. ‘తన ఇమేజిని నిర్మించుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు కాబట్టి, అలాంటి వాస్తవం బైటికి వస్తే అదంతా కుప్పకూలిపోతుంది కనుక ప్రధానమంత్రి భయపడుతున్నారు’ అని ఆమె అన్నారు. ఇప్పుడు నిజాలు బైటికి చెప్పడం వల్ల డోర్సేకి ఎలాంటి ప్రయోజనంఉండదని ఆమె అన్నారు. కాగా ‘రైతులను, రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన వారి ఖాతాలను మూసివేసేలా ప్రభుత్వం ట్విట్టర్‌పై ఒత్తిడి చేసింది, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుల ఖాతాలను మూసివేయించింది లేదా ట్విట్టర్‌పైన

, దాని ఉద్యోగులపై దాడులు చేస్తానని బెదిరించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిఇఓ జాక్ డోర్సేఓ టీవీ ఇంటర్వూలో అంగీకరించిన విషయం ఇది. ప్రభుత్వం దీనికి సమాధానం చెబుతుందా?’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జాక్ డోర్సే ఇంటర్వూలో ఈ ఆరోపణలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను కూడా ఆయన తన ట్వీట్‌తో పంచుకున్నారు. రైతుల ఆందోళన సమయంలో పిరికిపంద బిజెపి ప్రభుత్వం ట్విట్టర్‌ను మూసివేస్తామని, దాని ఉద్యోగులపై దాడులు చేస్తామని బెదిరించిందని ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత జైరాం రమేశ్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News