Sunday, January 12, 2025

2035 నాటికి భారత్ అంతరిక్షకేంద్రం సిద్ధం : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

- Advertisement -
- Advertisement -

భారతదేశం 2035 నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్నిసిద్ధం చేసుకోనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ , అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయులకు కాలుమోపే అవకాశం ఉందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ , అంతరిక్షమంత్రిత్వశాఖలు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. “ చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపాలనే ప్రణాళికలతో అంతరిక్ష పరిశోధనలో ప్రధాన మైలురాళ్లను సాధించడానికి సిద్ధంగా ఉంది. 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. అంతరిక్ష కేంద్రాలు కల్పిస్తున్న అమెరికా వంటి దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. ” అని ఆయన తెలిపారు.

భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర “గగన్‌యాన్ మిషన్‌” కు సంబంధించిన విషయాలను సైతం వెల్లడించారు. 2024 చివరికి లేదా 2026 ప్రారంభంలో ,మొదటి భారతీయ వ్యోమగామి గగన్‌యాన్ మిషన్ కింద అంతరిక్షం లోకి వెళతారని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్‌లో భాగంగా మత్స 6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నామన్నారు. జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు గరిష్ట లోతుకు(6000 మీటర్లు ) చేరుకోవచ్చని, దాంతో సముద్ర వనరులు, జీవవైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని తెలిపారు. సముద్ర గర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు.

ఈ నౌకను చెన్నై లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేసిందన్నారు . ఇది ప్రారంభమైతే భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్‌గా దీనికి గుర్తింపు దక్కనుందని పేర్కొన్నారు.ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని, జితేంద్రసింగ్ తెలిపారు. ఇప్పటివరకు భారతదేశం శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని, వాటిలో 397 (దాదాపు 90 శాతం ) ఉపగ్రహాలను గత దశాబ్దం లోనే ప్రయోగించామని పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవాన్ని నడిపించడంలో బయోఎకానమీ ప్రాధన్యాన్ని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News